అక్షరటుడే, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అమర్యాదగా ప్రవర్తించడం బాధకరమని లోకసభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కాగా, సోమవారం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్రమోదీ, గౌతమ్ అదానీ ముసుగులు ధరించిన ఇద్దరు ఎంపీలతో రాహుల్‌గాంధీని ఫన్నీ ఇంటర్వ్యూ నిర్వహించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికార పక్షమైనా.. విపక్షమైనా సభ మర్యాదాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం ఏ అంశమైనా చర్చించవచ్చని పేర్కొన్నారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. మనందరం సభా గౌరవాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈక్రమంలో ఇరు సభలు రేపటికి వాయిదా పడ్డాయి.