అక్షరటుడే, వెబ్‌డెస్క్: లోన్‌యాప్ యువకుడి ప్రాణం బలిగొంది. హనుమకొండలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన మాడుగుల అనిల్(29) డిగ్రీ వరకు చదువుకున్నాడు. ముల్కనూర్లోనే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తప్పని పరిస్థితుల్లో లోన్ యాప్ ద్వారా రూ.9 లక్షల రుణం తీసుకున్నాడు. అయితే అధిక వడ్డీలు వేస్తూ అప్పు చెల్లించాలని లోన్‌యాప్ నిర్వాహకులు నిత్యం ఫోన్లు చేసి వేధిస్తుండేవారు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.