
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dilsukhnagar Bomb Blast Case | దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడ్డ నిందితులకు ఇప్పుడప్పుడే శిక్ష అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే నిందితులకు మరిన్ని న్యాయ అవకాశాలు ఉన్నాయి. ఉరిశిక్ష రద్దు కోసం, క్షమాభిక్ష కోసం అడిగే ఛాన్స్ ఉంది. 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌లో Dilsukhnagar జరిగిన బాంబు పేలుళ్ల Bomb Blast ఘటనలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదంతంపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు Telangana High Court మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. జంట పేలుళ్ల కేసును విచారించిన ఎన్ఐఏ కోర్టు NIA court గతంలోనే ఐదుగురు నిందితులు యాసిన్ భత్కల్, జియా-ఉర్-రెహమాన్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, అజాజ్ షేక్‌కు ఉరిశిక్ష విధించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు మంగళవారం సమర్థించింది.
Dilsukhnagar Bomb Blast Case | ఇప్పట్లో అమలవడం కష్టమే..
ప్రస్తుతం హైకోర్టు High Court ఉరిశిక్ష విధించినప్పటికీ ఇప్పట్లో శిక్ష అమలు కాదు. ఎందుకంటే నిందితులకు ఉన్న న్యాయ అవకాశాలే కారణం. వారు సుప్రీంకోర్టుతో Supreme Court పాటు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఫలితంగా హైకోర్టు ఉరిశిక్ష విధించినా నిందితులను ఇప్పట్లో ఉరి తీయలేరు.
Dilsukhnagar Bomb Blast Case | నిందితులకు మరిన్ని అవకాశాలు..
ఉరిశిక్ష పడిన నిందితులకు న్యాయ పోరాటం చేసేందుకు రాజ్యాంగం ప్రకారం మరిన్ని అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు High Court ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో Supreme Court సవాల్ చేయవచ్చు. అక్కడ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఉరిశిక్షను సమర్థించినా ద్విసభ్య ధర్మాసనం వద్దకు వెళ్లవచ్చు. అక్కడా చుక్కెదురైతే రాష్ట్రపతిని ఆశ్రయించే అవకాశం కూడా నిందితులకు ఉంటుంది. తమకు క్షమాభిక్ష ప్రసాదించమని నిందితులు రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవచ్చు. అయితే, దాన్ని ఆమోదించాలా.. వద్దా? అన్నది రాష్ట్రపతి తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని నిర్ణయిస్తారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం Central Government, న్యాయశాఖ Law Ministry సలహాలు కూడా తీసుకుంటారు. ఒకవేళ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరిస్తే నిందితులకు ఉరిశిక్ష అమలు చేస్తారు.