అక్షరటుడే, ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లి తండాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని ఎల్లారెడ్డి లో ఆసుపత్రికి తరలించారు. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మెదక్ వైపు నుంచి ఎల్లారెడ్డికి వస్తుండగా.. ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న లారీ ఢీకొంది.
Lorry hits car | కారును ఢీకొన్న లారీ..ముగ్గురు పరిస్థితి విషమం
Advertisement
Advertisement