అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్ 47 పాయింట్లు, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మొదట్లో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా ఒడిదొడుకుల్లో కొనసాగి చివరికి సెన్సెక్స్‌ 110 పాయింట్ల నష్టంతో 77,580.31 వద్ద ముగియగా నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 23,532 వద్ద ముగిసింది. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టాటా కన్జ్యూమర్‌, బ్రిటానియా, బీపీసీఎల్‌, ఎన్టీపీసీ, నెస్లే, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టపోగా.. ఐచర్‌ మోటార్, హీరో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, కోటక్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో మగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 84.41కి పడిపోయింది. ఎఫ్‌ఐఐలు రూ. 1,849 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మగా.. రూ. 2,481 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

శుక్రవారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు

గురునానక్‌ జయంతి సందర్భంగా శుక్రవారం మన స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కావడంతో మార్కెట్లు మళ్లీ సోమవారం తెరుచుకుంటాయి.