అక్షరటుడే, వెబ్ డెస్క్: బాసర రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం రాత్రి రైల్వే పట్టాలపై ఇద్దరి మృతదేహాలను గుర్తించిన పోలీసులు విచారణ జరుపుతున్నా రు. నర్సపూర్ – నాగర్సొల్ రైలు కింద పడి వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. యువతి నిజామాబాద్ నగరంలోని నిశిత కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నట్లు సమాచారం. యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.