అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరానికి చెందిన యువతీయువకుడి సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ – నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చేసుకోగా.. నిజామాబాద్ రైల్వే పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపారు. యువకుడు కోటగల్లికి చెందిన సూరం శ్రీకాంత్(28), యువతి సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత(20)గా గుర్తించారు. శ్రీకాంత్ విశ్వభారతి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. నందిత నిశిత కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అయితే సూసైడ్ కు గల కారణాలు తెలియాల్సి ఉందని రైల్వే ఎస్సై సాయారెడ్డి తెలిపారు. నందిత కాలేజీలో చాలా క్లెవర్ స్టూడెంట్ అని సహచర విద్యార్థులు తెలిపారు. యువకుడు శ్రీకాంత్ సైతం సిన్సియర్ అని, వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వీరిద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.