Advertisement
అక్షర టుడే, భీమ్‌గల్: Bheemgal | ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు, రియల్టర్లు 25శాతం రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుదారులు, రియల్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై 25శాతం రాయితీ ఇస్తోందని, ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement