అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో మహాధర్నా కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని.. నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. 5 గంటలుగా ఆర్డీవో వాహనాన్ని గ్రామస్థులు నిర్భందించారు. ఆర్డీవో రత్న కల్యాణి కారులోనే ఉండిపోయారు. చలిమంటలు వేసి 4 గ్రామాల ప్రజలు ధర్నా చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఈధర్నా 11గంటలుగా కొనసాగుతోంది. దిలావర్పూర్‌లో 500 మంది పోలీసులను మోహరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వైపు జనం వెళ్లకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు హామీ ఇచ్చేవరకు ఆందోళన చేస్తామని గ్రామస్థులు తెగేసి చెపుతున్నారు. గ్రామస్థులతో ఎస్పీ జానకీ షర్మిల చర్చలు జరుపుతున్నారు.
Advertisement
Advertisement