అక్షరటుడే, బాన్సువాడ : Mahalaxmi scheme | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి నిధుల కొరత వేధిస్తోంది. ఈ పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో అట్టహాసంగా ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. అయితే మొదట వినియోగదారులు మొత్తం డబ్బు చెల్లిస్తే రూ.500 పోనూ.. మిగతా డబ్బు ప్రభుత్వం తిరిగి ఖాతాల్లో జమ చేసేది. కానీ, నిధుల కొరతతో సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావట్లేదు.
Mahalaxmi scheme | నిరీక్షిస్తున్న లబ్ధిదారులు
మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారులకు మూడు నెలలుగా సబ్సిడీ సొమ్ము అందడం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో డబ్బు ఖాతాల్లో జమ కావడం లేదు. అయితే ఈ విషయం తెలియని వినియోగదారులు గ్యాస్ డీలర్లు, బ్యాంకుల దగ్గరకు వెళ్లి సబ్సిడీ డబ్బులు ఎందుకు రావడం లేదని ఆరా తీస్తున్నారు. వారు తమకేమీ తెలియదని దాట వేస్తున్నారు.
Mahalaxmi scheme | మొదట్లో బాగానే వేసినా..
పథకం ప్రారంభమైన మొదట్లో సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వెనువెంటనే జమయ్యేవి. వినియోగదారులకు సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల వ్యవధిలోనే వారి బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వచ్చేవి. పైగా వారి మొబైల్‌కు మేసేజ్ కూడా వచ్చేది. ప్రస్తుతం ఆ సబ్సిడీ డబ్బులు ఎప్పుడు పడతాయన్నది క్లారిటీ లేకపోవటంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
Mahalaxmi scheme | జమ కావడం లేదు
– ఎన్.రేఖ, బాన్సువాడ
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు రావడం లేదు. మొదట్లో డబ్బులు ఖాతాలో జమయ్యేవి. రెండు, మూడు నెలల నుంచి డబ్బులు రావడం లేదు.