అక్షరటుడే, వెబ్డెస్క్: Mahesh Rajamouli | సూపర్ స్టార్ మహేష్ ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ అప్డేట్ ప్రతి సినీ ప్రేక్షకుడిని సర్ ప్రైజ్ చేస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ తో కేవలం నాటు నాటు పాటకి మాత్రమే ఆస్కార్ రాగా.. ఈసారి మహేష్ సినిమా అన్ని విభాగాల్లో ఆస్కార్ లో నిలిచేలా తీర్చిదిద్దుతున్నాడు జక్కన్న.
SSMB 29గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ మొదటిదాకా హైదరాబాద్ లో జరగ్గా.. ఇప్పుడు ఒడిషాలో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఒడిషాలోని కోరపుట్ లో తలమలిలో నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mahesh Rajamouli | చిన్న వార్త వచ్చినా ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్
మహేష్ రాజమౌళి సినిమా ఏ చిన్న వార్త వచ్చినా ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఐతే ఈ వీడియో ఇలా వచ్చిందో లేదో అలా వైరల్ అవుతోంది. సినిమా గురించి ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని రాజమౌళి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు. అయినా కూడా ఏదో ఒక రకంగా వీడియోస్ బయటకు వస్తూనే ఉన్నాయి.
ఇక మహేష్ రాజమౌళి సినిమాలో మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమార్ విలన్ గా నటిస్తాడన్న టాక్ ఉంది. ఐతే ఈమధ్య ఆయన కూడా ఎయిర్ పోర్ట్ లో కనిపించడం చూసి మహేష్ సినిమాలో పృధ్వి రాజ్ కన్ ఫర్మ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి రాజమౌళి ఒక ప్రెస్ మీట్ పెడతారని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. కానీ జక్కన్న అలాంటి ప్లాన్స్ ఏమి లేదన్నట్టుగా ఉన్నాడు.
కాగా..మహేష్ రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పనిచేస్తారని తెలుస్తుంది. సినిమాను రాజమౌళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపిస్తారని తెలుస్తుంది.