అక్షరటుడే ,ఎల్లారెడ్డి: లింగంపేట్ మండలంలో శనివారం జరిగిన ఆటో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లింగంపేట్ మండలం కొర్పోల్ గ్రామంలో నిర్వహించిన వివాహ వేడుకకు పలువురు ఆటోలో వచ్చారు. తిరుగు ప్రయాణంలో బాయంపల్లి గేటు వద్ద సదరు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహమ్మద్ నగర్ మండలం సింగీతం గ్రామానికి చెందిన సంగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని స్థానికులు 108 లో ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement