అక్షరటుడే, వెబ్ డెస్క్: కామారెడ్డి బైపాస్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగింది. నిర్మల్ డిపోకు చెందిన రాజధాని బస్సు, కారు, డీసిఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం కాగా.. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ఎర్గట్ల వాసులు క్షేమంగా బయటపడ్డారు. కాగా డీసీఎం డ్రైవర్ వాహనాన్ని రోడ్డుపైనే వదిలి పారిపోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.