Lingampet |సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి

Lingampet |సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి
Lingampet |సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి
Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lingampet | సేవాలాల్ మహరాజ్ జయంతిని ఈనెల 18న లింగంపేటలో అధికారికంగా నిర్వహించనున్నట్లు బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ తెలిపారు. లింగంపేట బంజారా సేవా సంఘం సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈనెల 18న జీఎన్ఆర్ గార్డెన్లో సేవాలాల్ మహరాజ్ జయంతిని నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గిరిజనులు హాజరు కావాలని కోరారు. గన్ను నాయక్, పీర్ సింగ్, దేశ నాయక్, పరశురాం, ప్రకాష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | నాగన్న బావిని సందర్శించిన విద్యార్థులు