Vishwambhara Movie : విశ్వంభ‌ర వీఎఫ్ఎక్స్​పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన నిర్మాతలు.. అందుకే సినిమా వాయిదా ప‌డుతుందా?

Vishwambhara Movie : విశ్వంభ‌ర వీఎఫ్ఎక్స్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన నిర్మాతలు.. అందుకే సినిమా వాయిదా ప‌డుతుందా?
Vishwambhara Movie : విశ్వంభ‌ర వీఎఫ్ఎక్స్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన నిర్మాతలు.. అందుకే సినిమా వాయిదా ప‌డుతుందా?
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vishwambhara Movie : మెగాస్టార్ చిరంజీవి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ మ‌ధ్య కాలంలో చిరంజీవి చేసిన సినిమాలేవీ అంత పెద్ద హిట్ కాలేదు. ఇప్పుడు విశ్వంభ‌ర మూవీపై బారీ హోప్స్ పెట్టుకున్నారు. ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్​లు.. కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ‘గేమ్ ఛేంజర్’ కోసం సినిమాని వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ అస‌లు క‌థ వేరే ఉంది.

ఆ మ‌ధ్య చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేస్తే, అందులో వీఎఫ్ఎక్స్ తేలిపోయాయి. అమీర్ పేట గ్రాఫిక్స్ అంటూ మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. దాంతో వీఎఫ్ఎక్స్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. ఈ సారి స‌మ్మ‌ర్‌కి మూవీని ఎలా అయినా తీసుకురావాల‌ని అనుకుంటున్నారు. అలానే వీఎఫ్ఎక్స్‌పై కూడా ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘విశ్వంభర’ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కథనాలను గమనిస్తే.. ‘ఒక రాక్షసుడు ఉంటాడట. అతను కొంతమంది చిన్న పిల్లలను, దేవకన్యలు ఎత్తుకుపోతూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక దేవ కన్య భూమి మీదకు వస్తుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Chiranjeevi : చిరంజీవి బర్త్ డే కానుకగా విశ్వంభర.. రిలీజ్ క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

ఆమె అనుకోకుండా హీరోని ప్రేమించడం, పెళ్లి చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. మరోపక్క ఆమె భూమిపై ఉందని తెలుసుకున్న రాక్షసుడు.. ఆమెను అలాగే ఒక ఫ్యామిలీకి చెందిన పాపని తీసుకుపోయి పాపని బలివ్వాలని, అలాగే దేవకన్యని తన వశం చేసుకుని శక్తివంతుడు అయిపోయి.. ఆమె తండ్రిని, స్వర్గలోకాన్ని తన చెంత చేర్చుకోవాల‌ని అనుకుంటాడ‌ట‌. ఇలా అనేక విష‌యాలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. చూస్తుంటే ఈ క‌థ కాస్త ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’కి దగ్గరగా ఉందని అనిపిస్తుంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Advertisement