Advertisement
అక్షరటుడే, బాన్సువాడ: తెలంగాణ ఉద్యమం, ప్రజా సమస్యలపై గద్దర్ సమాజాన్ని నిరంతరం చైతన్యం చేశారని మాల సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు దేశాయిపేట్ ప్రశాంత్ అన్నారు. గద్దర్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్, బంగారు మైసయ్య, మాజీ సర్పంచ్ కుమ్మరి రాజు, మన్నె భూషణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement