అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని శుక్రవారం మలేరియా అధికారి శివయ్య సందర్శించారు. గ్రామంలో సుమారు పదిమందికి డెంగీ, మరికొందరికి చికున్ గున్యా, మలేరియా విషజ్వరాలు రావడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులకు చికిత్సలు అందించారు. ప్రస్తుతం గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, విష జ్వరాలు తగ్గుముఖం పట్టాయని మలేరియా అధికారి పేర్కొన్నారు. సూపర్‌వైజర్ ఎలిజబెత్, పంచాయతీ కార్యదర్శి ఫరీదా, ఆశా కార్యకర్తలతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.