అక్షరటుడే, వెబ్ డెస్క్: హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా ఈ రోజు(నవంబర్ 28) ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఎస్ నాగవంశీ, సాయి గెయ్య నిర్మించిన ఈ చిత్రం గత అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.