అక్షరటుడే, బోధన్: సాలూర మండలం మందర్నా శివారులో మంజీర నది పక్కన గల రాంసాల కుంటలో చేపల వేటకు వెళ్లి హున్సా గ్రామానికి చెందిన మల్లారం సాయిలు (43) మృతి చెందాడు. సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సాయిలు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కుంట వద్ద వెతకడంతో శవమై తేలాడు. బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు.