Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: Holi | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన మాటలు, శైలీతో నిత్యం వార్తల్లో ఉంటారు. తాజాగా హోలీ వేడుకల్లో భాగంగా ఆయన కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు. హైదరాబాద్ – బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద హోలీ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి స్టెప్పులు వేశారు. అనంతరం దరువేసి నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement