అక్షరటుడే, వెబ్డెస్క్ : CPR | బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి mallareddy కోడలు మానవత్వం చాటుకున్నారు. విమానంలో అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడి ప్రాణాలను సీపీఆర్ CPR చేసి కాపాడారు. మల్లారెడ్డి కోడలు ప్రతిరెడ్డి preeethi reddy డాక్టర్. ఆమె ఢిల్లీ Delhi నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ Hyderabadకు బయలుదేరారు. అయితే విమానం గాలిలో ఉండగా అందులోని 74 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యానికి గురయ్యాడు.
బీపీ తక్కువ ఉండటంతో పాటు ఫిట్స్ వచ్చినట్లు గుర్తించిన ప్రీతిరెడ్డి వెంటనే సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలను కాపాడారు. తర్వాత విమానంలోని మెడికల్ కిట్లో నుంచి మెడిసిన్ ఇవ్వడంతో ఆ వృద్ధుడు కోలుకున్నాడు. విమానం ల్యాండ్ అయ్యాక సదరు వృద్ధుడిని ఎయిర్పోర్టు airport సిబ్బంది ఆస్పత్రి hospital కి తరలించి చికిత్స అందించారు.