అక్షరటుడే, కోటగిరి: బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా రూ.4వేల జీవనభృతి అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వెంటనే భృతి అందించాలని కోరారు. లేకుంటే కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో కళావతి, లక్ష్మి, అనిత, గంగామణి, వనిత, జమున, మంగ, సావిత్రి, భాగ్య, బీడీ కార్మికులు పాల్గొన్నారు.