అక్షరటుడే, వెబ్ డెస్క్: డిచ్‌పల్లి సీఐగా మల్లేశ్ యథావిధిగా కొనసాగనున్నారు. రెండు రోజుల కిందట ఆయనను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఉన్న తిరుపయ్యకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. కానీ, తాజాగా ఈ బదిలీ రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో మల్లేశ్‌ను అధికారులు రిలీవ్ చేయలేదు. తిరుపయ్య సైతం కామారెడ్డి ఎస్‌బీ నుంచి రిలీవ్ కాలేదు. గతంలో ఆర్మూర్ సీఐ బదిలీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ముఖ్యంగా పొలిటికల్ పోస్టింగులను సీపీ కల్మేశ్వర్ ఏమాత్రం ఉపేక్షించట్లేదు. నేతల పైరవీలతో పోస్టింగ్‌లకు అవకాశం ఇవ్వట్లేదు.