Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని మామిడిపల్లి ముజిగె మల్లన్న జాతరను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలో రథాన్ని ఊరేగించారు. గుట్ట చుట్టూ నిర్వహించిన ప్రదక్షిణలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు లక్ష్మణ్, రవి, శ్రీనివాస్, రాజన్న, సాజిద్, కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

Advertisement