అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్: డిచ్‌పల్లి మండలంలోని ఘన్‌పూర్‌కు చెందిన మచ్చ ప్రవీణ్(45) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని ప్రైమరీ స్కూల్ సమీపంలో గల చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత 15 ఏళ్లుగా దుబాయ్‌లో పనిచేస్తున్న ప్రవీణ్ రెండు నెలల క్రితమే ఇంటికి వచ్చాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement