రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని మోగులాన్పల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన మొహమ్మద్ ముక్తార్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లుట్ల నుంచి బాన్సువాడ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముక్తార్ అతని భార్య ఆయేష బేగంకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా ముక్తార్ మృతి చెందినట్లు సీఐ కృష్ణ తెలిపారు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Banswada | కాంగ్రెస్ పార్టీలో​ కార్యకర్తలందరికీ సమప్రాధాన్యం : కాసుల బాలరాజ్​