Kamareddy | పెట్రోల్​ కాపాడుకునేందుకు చేసిన ఉపాయం భార్య ప్రాణాలనే తీసింది..

Kamareddy | పెట్రోల్​ కాపాడుకునేందుకు చేసిన ఉపాయం భార్య ప్రాణాలనే తీసింది..
Kamareddy | పెట్రోల్​ కాపాడుకునేందుకు చేసిన ఉపాయం భార్య ప్రాణాలనే తీసింది..
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బైకులో నుంచి దుండగులు పెట్రోల్ దొంగతనం చేస్తున్నారని ఓ వ్యక్తి కాస్త ఉపాయంగా ఆలోచించాడు. ఇందుకోసం ఏకంగా బైకుకే కరెంట్ షాక్ పెట్టాడు.. తీరా ఆ ఉపాయమే అతడి కొంప ముంచింది. కట్టుకున్న భార్యను బలితీసుకుంది.. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది..

పోలీసుల కథనం ప్రకారం.. దోమకొండ మండలం సీతారాంపల్లిలోని రాజనర్సుకు చెందిన టీవీఎస్ ఎక్సెల్​ వాహనం నుంచి కొద్దిరోజులుగా దుండగులు రాత్రి సమయంలో పెట్రోల్ దొంగిలిస్తున్నారు. దీంతో పెట్రోల్​ కాపాడుకునేందుకు రాజనర్సు ఓ ఉపాయం చేశాడు. శనివారం రాత్రి తన వాహనానికి కరెంటు షాక్ పెట్టి ఇంటి పక్కనే గల రేకుల షెడ్డులో పార్కింగ్ చేసి ఉంచాడు. కాగా.. అదే షెడ్డులో భార్య రాధిక వంట చేస్తుండగా గమనించకుండా టీవీఎస్ వాహనాన్ని తాకింది. దీంతో కరెంటు షాక్ తగిలి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాధిక మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. రాధిక మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త రాజనర్సు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  షబ్బీర్​అలీకి మంత్రి పదవి ఇవ్వాలి