అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై చాంబర్లో ఉరేసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఏసీపీ కార్యాలయంలో మీటింగ్ లో ఉండగా.. ఆ సమయంలో రమేష్ అనే వ్యక్తి ఎస్సై గదిలోకి వెళ్లి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది హుటాహుటిన అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే సూసైడ్ అటెంప్ట్ కు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వ్యక్తి ఎస్సై చాంబర్లోకి వెళ్లి అఘాయిత్నానికి పాల్పడినా అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఏం చేశారన్నది చర్చకు దారితీసింది.