అక్షరటుడే, ఎల్లారెడ్డి: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లింగంపేట మండలం కోమటిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై చైతన్య కుమార్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధరణి ఎల్లయ్య (35) శనివారం భార్య, కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెంది రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.