అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : సహకార సంఘాలను బలోపేతం చేయాలని రాష్ట్ర కో-ఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్ మానాల మోహన్‌ రెడ్డి సూచించారు. బుధవారం ఢిల్లీలో నేషనల్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ సంఘానే ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌సీయూఐ వార్షిక మహాజన సభలో రాష్ట్రం తరపున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేషనల్‌ కో-ఆపరేటివ్‌ యూనియన్‌ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర యూనియన్లు సహకరించినప్పుడే గ్రామాలలో సహకార సంఘాల మనుగడ కొనసాగుతుందన్నారు. నేషనల్‌ యూనియన్‌ తీసుకునే ప్రతి నిర్ణయానికి రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు.