అక్షరటుడే, ఆర్మూర్‌: బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్‌ ఛార్జీలను అడ్డగోలుగా పెంచి ప్రస్తుతం విజయోత్సవాలు జరుపుకోవడంలో అర్థం లేదని సహకార యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్‌ ఇస్తున్నామన్నారు. దాదాపు 50 లక్షల గృహాల వరకు జీరో బిల్లులు ఇస్తున్నామని వివరించారు. ఇది అబద్ధమైతే ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలని, తాము సిద్ధమేని సవాల్ విసిరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య, కొంటా రమేశ్‌, అనంతరావు, గోపాల్‌నాయక్‌, రాజు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.