అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తులపై మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌ తనిఖీల్లో సుమారు 27 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టుకు సరెండర్‌ చేయగా.. గురువారం కోర్టు స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వారంరోజులు పారిశుధ్య పనులు చేయాలని తీర్పునిచ్చింది.