అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Manchu Family | మంచు ఫ్యామిలీ కొంతకాలంగా నిత్యం వార్తల్లో ఉంటుంది. కుటుంబ వివాదాలతో మోహన్‌బాబు(Mohanbabu) ఇద్దరు తనయులు విష్ణు(Vishnu), మనోజ్(Manoj) మీడియాకు ఎక్కడం, పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో వివాదం రోజురోజుకు పెద్దది అవుతోంది.
ఇటీవల మంచు మనోజ్ తన అన్న విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కారు, వస్తువులు దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. అనంతరం మోహన్‌బాబు ఇంటికి వెళ్లిన మనోజ్ ను గేట్ దగ్గర అడ్డుకోవడంతో అక్కడే ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ వివాదంపై ఎప్పుడు కూడా మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి(Manchu Laxmi) స్పందించలేదు. తాజాగా శనివారం హైదరాబాద్(Hyderabad)లో జరిగిన ఓ ఈవెంట్లో మంచు లక్ష్మి, మనోజ్ ఎమోషనల్ అయ్యారు. లక్ష్మిని మనోజ్ వెళ్లి పలకరించగా.. ఆమె ఒక్కసారిగా కంటతడి పెట్టారు. సోదరుడిని కౌగిలించుకొని ఏడ్చారు. పక్కనే ఉన్న మనోజ్ సతీమణి మౌనిక ఆమెను ఓదార్చారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.