అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మా నాన్నను అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. నాన్న అంటే తనకు ప్రాణమని, నాన్న దేవుడు అని పేర్కొన్నారు. తన భార్యతో కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెడితే.. దానికి కూడా అడ్డంకులు సృష్టించారన్నారు. అలాగే మీడియా ప్రతినిధులకు మంచు మనోజ్ క్షమాపణలు చెప్పారు. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.