అక్షరటుడే, కోటగిరి : ఎరువులు, పురుగు మందులు ఎమ్మార్పీకే విక్రయించాలని మండల వ్యవసాయాధికారి రాజు తెలిపారు. గురువారం కోటగిరి మండలంలోని రైతు వేదికలో సహకార సంఘం కార్యదర్శులతో, ప్రైవేట్ డీలర్లతో ఎరువుల అమ్మకాలపై సమీక్ష నిర్వహించారు. నిషేధిత ఎరువులు, పురుగు మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుర్తింపు పొందిన కంపెనీల నుంచి ఎరువులు, పురుగు మందులు దిగుమతి చేసుకోవాలని, ఎరువులు అమ్మకాలు చేసేటప్పుడు రైతుల ఆధార్ నెంబర్ నమోదు చేసుకుని, డీబీటీ ప్రకారం అమ్మకాలు జరపాలన్నారు. ముఖ్యంగా డీఏపీ , యూరియా అందుబాటులో ఉంచాలన్నారు.