Advertisement
అక్షరటుడే, ఇందూరు: RTC | నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో మంగళసూత్రం చోరీ జరిగింది. డిచ్ పల్లి మండలానికి చెందిన ఫిర్యాది అయిన చెలిమెల వర్షిని గుత్పకు వెళ్దామని డిచ్పల్లి నుంచి బయలుదేరి నిజామాబాద్ కు చేరుకొన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ఆర్మూర్ బస్సు ఎక్కారు. రద్దీ అధికంగా ఉండడంతో తన రెండు తులాల బంగారు మంగళ సూత్రంను బ్యాగులో దాచిపెట్టారు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు దానిని దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒకటో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement