అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : మానిక్‌ భవన్ ఉన్నత పాఠశాల పీఈటీ సురేందర్‌ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని డ్రాయింగ్‌ మాస్టర్‌ యేముల శ్రీనివాస్‌ చేతితో వేసిన సురేందర్‌ కాన్వాస్‌ ఫొటోను పీఈటీ సురేందర్‌కు బహూకరించారు. ఇప్పటివరకు 16 మంది ఉపాధ్యాయులకు శ్రీనివాస్‌ ఇలాంటి ఫొటోలను బహూకరించాడని హెచ్‌ఎం బుచ్చయ్య తెలిపారు. అనంతరం హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పీఈటీ సురేందర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల పాలకవర్గం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement