అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న వానాకాలం పంటల సాగు కోసం ఆదివారం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. నిజాంసాగర్ నుంచి అలీసాగర్ వరకు ప్రస్తుతం లక్ష 15 వేల ఎకరాల్లో వరి పంటలను సాగు చేస్తున్నారని.. రైతన్నలకు సాగునీరు అవసరాల దృష్ట్యా రెండు విడతల్లో సుమారు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 4.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా ఆదివారం నీటిని విడుదల చేయనున్నారు.