
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Health Benefits : సాధారణంగా మనం రోడ్ల పక్కన ఈమొక్కలను చూస్తూనే ఉంటాం . మనకు తెలియని మొక్కలు ఎన్నో మన చుట్టూరానే ఉంటాయి. ఆ మొక్కలు మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని మనకు తెలియదు. ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు. మన కళ్ళమూందే, మనతోనే ఉంటాయి అయినా మనం గుర్తించం. ఆ మొక్కలు గురించి తెలిసినా కూడా మనం చాలా చులకనగా చూస్తాం. ఎపుడైనా మనం బయటికి వెళ్లినప్పుడు రోడ్డు పక్కన కనిపించే ఎన్నో మొక్కలని మనం చూస్తూనే ఉంటాం,ఇందులో అద్భుతమైన శక్తిని దాగి ఉన్నాయి.
ఆంటీ ఔషధ గుణాలను కలిగిన మొక్క గురించి మనం తెలుసుకుందాం… మనకు ఎన్నో మెడిసిన్స్ ను కలిగిన మొక్కలను ప్రసాదించింది. ఈ మొక్కల గురించి కొందరికి తెలియదు. దేవుడిచ్చిన ఈ మొక్కలలో అద్భుతమైన శక్తి దాగి ఉంది. మొక్కలు మనకు రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ మొలిసి ఉంటాయి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. మన శరిరంలో ఏ ప్రదేశంలో నొప్పి ఉన్న అది తగ్గించగలదు. నొప్పులతో బాధపడే వారికి ఆ నొప్పులు కొన్ని రోజుల్లోనే దూరం చేస్తుంది. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే.. బట్టతలపై జుట్టును పెరిగేలా చేయగలదని చెబుతున్నారు నిపుణులు. సరియైన పద్ధతిలో వాడితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
మరి ఆ మొక్క ఏమిటి, దాని: ప్రయోజనాలు : రోడ్డు పక్కన ఎక్కడపడితే అక్కడ మొలిచే ఈ మొక్క పేరు “జిల్లేడు”(Aak plant). దీని ఆకులు మందంగా ఉంటాయి. రంగు చుక్కలతో తెల్లని పుష్పాలు అందంగా కనిపిస్తాయి. కాయలు చూడడానికి పిందే మామిడిలా ఉంటాయి. లోపల మాత్రం పత్తి లాగా ఉంటుంది. దిని కొమ్మల నుంచి వచ్చే పాలు విషం గా పనిచేస్తాయని ఆయుర్వేదంలో చెప్పారు. దీనినే జిల్లేడు పాలు అంటారు. జీలేడు పాలు కళ్ళల్లో కనక పడితే కళ్ళు పోతాయి అని అంటుంటారు. ఎందుకంటే ఈ పాలు విషం తో సమానం. జిల్లేడు కొమ్మలను తుంచే టైంలో జాగ్రత్తలు పాటించాలి. పాలు ఎక్కువగా తీసుకుంటే వాంతులు, డయేరియా వంటి సమస్యలు కూడా వస్తాయి. డాక్టర్ సలహాతో సరైన మోతాదుల్లో వాడితే ఎన్నో రోగాలకు మందులాగా పనిచేస్తుంది. దీని ప్రతిభాగం ఆకులు, కాండం, వేర్లు, మెడిసిన్ లో ముఖ్య పాత్రను కలిగి ఉంది.
జిల్లేడు మొక్క జుట్టు పెరుగుదల : జుట్టు బాగా రాలిపోయి బట్టతల వచ్చిన వారికి ఈ జిల్లేడు చెట్టు మొక్క పాలు ఒక వరం లాగా పని చేస్తుంది. జుట్టు రాలిపోయి బట్ట తల వచ్చిన చోట జాగ్రత్తగా ఈ జిల్లేడు పాలు రాస్తే కొత్త జుట్టు పెరుగుతుందని ఆయుర్వేదంలో తెలుపబడింది. ఈ మొక్క ఆకులని గాని కాండాన్ని లేదా పువ్వులని తుంచేటప్పుడు చాలా జాగ్రత్త పాటిస్తూ తుంచాలి. లేదంటే ఆ పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, పాలు కళ్ళల్లో పడకుండా జాగ్రత్త వహించాలి. నిపుణులు సహజంగా హెయిర్ ఫాలికల్స్ ని స్టిమ్యూలేట్ చేస్తుందని కొన్ని స్టడీస్ లో తెలియజేశారు. అలాగే, ఈ పాలతో ముఖం పై మొటిమలు కూడా తగ్గించవచ్చు. కందిరీగలు, తేనెటీగలు కుట్టిన చోట వేస్తే నొప్పి తగ్గుతుంది. గాయాలను నయం చేస్తుంది.
ఆర్థరైటిస్ కు రక్షణ : కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆ బాధను అనుభవించలేక ఎన్నో మెడిసిన్ వాడుతారు. ఆయింట్ ట్మెంట్లను కూడా వాడి విసిగిపోతారు. అలాంటి వారికి కీళ్ల నొప్పులను తగ్గించుటకు ఈ జిల్లేడు మొక్క పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మొక్క వేర్లను తీసుకొని సరిపడా నీళ్లలో వేసి మరిగించాలి. నీరు సగానికి మరియాక వేర్లు తీసేసి దాంట్లో గోధుమలు వేసి ఉడికించాలి. గోధుమలను ఆరబెట్టి పిండి తయారు చేయాలి. దానితో రొట్టెలు చేసుకొని బెల్లం, ఈ కలిపి రోజు తింటే ఆర్థరైటిస్ 21 రోజుల్లో తగ్గిపోవాల్సిందే. ఈ పద్ధతి శరీరంలో ఇన్ఫలమేషనును తగ్గించి జాయింట్స్ ను బలంగా చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. దీంతో నొప్పి తగ్గడమే కాదు, కీళ్ల జాయింట్స్ మూమెంట్స్ కూడా సులభంగా అవుతాయి.
ఇతర లాభాలు : జిల్లేడు మొక్క(Aak plant) ఆకులను అరికాళ్ళకు కట్టి, సాక్స్ వేసి రోజంతా ఉంచితే వారంలో షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతాయని ఆయుర్వేద నిధులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా కరుగుతుందంట. దీని ఆకులను తీసి నూనెలో కాల్చి వాతం ఉన్నచోట కడితే వాపు తగ్గుతుంది. దీని వేర్లను పొడి చేసి మిరియాలతో కలిపి గుళికలుగా తింటే దగ్గు పరారవుతుంది. వేర్లు బూడిద నువ్వు నూనెతో కలిపి రాస్తే దురద తగ్గుతుంది. ఆకు కాండాన్ని కాల్చి పొగకు ముక్కు ద్వారా పీల్చితే తలనొప్పి తక్షణమే తగ్గిపోతుంది.
జిల్లేడు మొక్కతో జాగ్రత్తలు తప్పనిసరి : ఈ జిల్లేడు తో ఎన్ని లాభాలు ఉన్నా.. ఈ జిల్లేడును అతిగా వాడితే మాత్రం ప్రమాదమే. ఈ మొక్క పాలు విషతుల్యంగా పనిచేస్తాయి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకమే. ప్రాణానికీ ముప్పు వాటిల్లవచ్చు. ఆకులను నీటిలో కలిపి ఎనిమా చేస్తే ఫైల్స్ తగ్గుతాయి. వేర్లను పొడి చేసి నీటితో కలిపి తాగితే సిఫిల్స్ నయమవుతాయి. కానీ ఈ పద్ధతులుని డాక్టరు సూచనలతోనే పాటించాల్సి ఉంటుంది. గోళ్ళ సమస్యలకు వేర్లను నీటిలో రుద్ది రాస్తే ఫలితం ఉంటుంది. జలుబు, జ్వరానికి వేర్లపొడిని బెల్లంతో కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. దీనిని ఉపయోగించాలనుకుంటే కచ్చితంగా డాక్టర్లను సంప్రదించి వారి సలహా మేరకు తీసుకోవలసి ఉంటుంది. అతిగా వాడకూడదు.