అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తిరుమలలో పలు హోటళ్లు, వరాహస్వామి ఆలయం ఇస్కాన్‌ టెంపుల్‌లను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. దీనిపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బెదిరింపు ఫోన్‌కాల్స్‌, మెయిల్స్‌పై పూర్తి విచారణ చేస్తున్నామన్నారు. అయితే తిరుమలలో బాంబు బెదిరింపులపై ఎన్‌ఐఏ దృష్టి సారించింది.