కారు, ట్రాలీ ఆటో ఢీ : పలువురికి గాయాలు

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కారును ఆటో ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రెంజల్‌ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్‌ మండలం సాటాపూర్‌ నుంచి వస్తున్న ట్రాలీ ఆటోను వీరన్నగుట్ట నుంచి వస్తున్న కారు సాటాపూర్‌లోని ఓ స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి, కారు డ్రైవర్‌ రవిగౌడ్‌కు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను పోలీసులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.