Advertisement

అక్షరటుడే, బిచ్కుంద: ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన డోంగ్లి మండలంలోని ఎంపీటీసీ పరిధి నుంచి మొగా గ్రామాన్ని వేరు చేయాలని పలువురు గ్రామస్థులు, నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం మద్నూర్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ధోతి, మల్లాపూర్, మారేపల్లి, లక్ష్మాపూర్, మొగా గ్రామాలను కలిపి ఎంపీటీసీ పరిధిగా నిర్ణయించిందన్నారు. కానీ ధోతి, మల్లాపూర్, మారేపల్లి పంచాయతీలను ఒక ఎంపీటీసీగా చేసి, మొగా గ్రామాన్ని తొలగించాలని కోరారు. కార్యక్రమంలో ధోతి సర్పంచ్ కాశీనాథ్ పటేల్, శ్రీకాంత్ పటేల్, మల్లాపూర్ మాజీ ఎంపీటీసీ సంజయ్, మారేపల్లి సర్పంచ్ ప్రవీణ్, వసంత్ రావు పాటిల్, వీరేష్ గొండ, శాంతేశ్వరప్ప, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Advertisement