అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలం కూనిపూర్ శివాలయం పరిసరాల్లో చిరుత అడుగుల ఆనవాళ్లను పలువురు గ్రామస్థులు గుర్తించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని గ్రామ పెద్దలు సూచించారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే అవి చిరుత పులి గుర్తులా, లేదా మరేదైనా జంతువు గుర్తులా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.