అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇన్‌ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడులో చోటు చేసుకుంది. పోలీసులతో కుమ్మక్కై ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని ఇద్దరిని గొడ్డలితో నరికి చంపారు. మృతుల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు.