అక్షరటుడే, వెబ్‌డెస్క్: Maoist | మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సల్స్ ఏరివేత చర్యలు ఉధృతం కావడంతో ఊహించని రీతిలో ప్రాణ నష్టం జరుగుతుంది. గత జనవరి నుంచి మావోలకు కోలేకోలేని దెబ్బలు తగిలాయి. కేడర్‌తో పాటు కీలక నేతలను సైతం ఆ పార్టీ కోల్పోయింది. దండకారణ్యంలో Dandakaranya గట్టి పట్టున్న ప్రాంతాల్లోకీ భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. నలువైపులా నుంచి చుట్టుముడుతుండడంతో మావోలకు తప్పించుకునే వీలు లేకుండా పోతుంది. గత జనవరి నుంచి కీలక నేతలు key leaders సహా కార్యకర్తలు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
Maoist | వచ్చే మార్చి వరకు మావో రహిత భారత్‌గా..
వచ్చే ఏడాది మార్చి వరకు భారత్‌ను మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో భద్రతాదళాలు నక్సల్స్ ఏరివేత చర్యలను ముమ్మరం చేశాయి. తరచూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా సుమారు వంద మందికి పైగా మావోలను భద్రతాదళాలు కాల్చి చంపాయి.
Maoist | జల్లెడ పడుతున్న బలగాలు..
మావోయిస్టుల Maoist ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు దండకారాన్ని చుట్టుముడుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్ల technology and drones వినియోగంతో పాటు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు కదులుతున్నాయి. అబూజ్‌మడ్ అడవులే Abujmad forests టార్గెట్‌గా భద్రతా బలగాలు జనవరి నుంచి జల్లెడ పడుతున్నాయి. ఏప్రిల్ 16న జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత జరిగిన కోర్చోలి ఎన్‌కౌంటర్‌లో Korcholi encounter 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 11న బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది హతమయ్యారు. నారాయణపూర్ ఎన్‌కౌంటర్‌లో Narayanpur encounter 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మందికి పైగా మృతి చెందారు.