అక్షరటుడే, కామారెడ్డి: వడ్డెర వృత్తిదారులపై ‘పొద్దు పొడిచే సూర్యుడా..’ పేరిట సందేశాత్మక వీడియో రూపొందించడం అభినందనీయమని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తారి మారన్న అన్నారు. మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లికి చెందిన కృష్ణ, భిక్కనూర్ కు చెందిన హరి వడ్డెర వృత్తిపై వీడియో రూపొందించగా, మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గణేష్ నాయక్, ఐకేపీ రాష్ట్ర అధ్యక్షుడు పఠాన్ గౌస్ ఖాన్, గోర్ బంజారా శిక్ వాడి గాయకులు శివరాం నాయక్, అంకం కిషోర్, వడ్డె దశరథ్, తదితరులు పాల్గొన్నారు.