Mark Shankar : మార్క్ శంక‌ర్ ఆరోగ్యం ఎలా ఉంది.. వైద్యానికి అంత ఖ‌ర్చు అయిందా?

Mark Shankar : మార్క్ శంక‌ర్ ఆరోగ్యం ఎలా ఉంది.. వైద్యానికి అంత ఖ‌ర్చు అయిందా?
Mark Shankar : మార్క్ శంక‌ర్ ఆరోగ్యం ఎలా ఉంది.. వైద్యానికి అంత ఖ‌ర్చు అయిందా?

అక్షరటుడే, వెబ్ డెస్క్ Mark Shankar : పవ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంక‌ర్ (Mark Shankar) కొద్ది రోజుల క్రితం సింగపూర్‌లోని (Singapore) ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపింది. కుమారుడి క్షేమ సమాచారం గురించి ఆందోళన చెందిన పవన్ కళ్యాణ్.. హుటాహుటిన సింగపూర్ బయల్దేరి వెళ్లారు. వైద్యుల‌తో మాట్లాడి మార్క్ (Mark Shankar) త్వ‌ర‌గా కోలుకునే ప్ర‌యత్నం చేశారు ప‌వ‌న్ (Pawan Kalyan). ప్ర‌స్తుతం మార్క్ డిశ్చార్జ్ అయి ఇంట్లోనే ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే తన పెద్ద కుమారుడు అకీరా నందన్ పుట్టినరోజు నాడే చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరగడంపై ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Mark Shankar : ఖ‌ర్చు ఎంత‌?

అయితే మార్క్ ఊపిరితిత్తుల‌లోకి న‌ల్ల‌ని పొగ చేర‌డంతో బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్‌మెంట్‌ని అందించిన‌ట్టు తెలుస్తుంది. దీనికి ల‌క్ష‌ల ఖ‌ర్చు అవుతుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. కానీ కేవలం నాలుగు వేల రూపాయిల నుండి 30 వేల రూపాయిల ఖర్చుతో ఈ ట్రీట్‌మెంట్ అయిపోతుంద‌ట‌. పరిస్థితి తీవ్రతని బట్టి ఏ తరహా బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ ఇవ్వాల‌నేది డాక్ట‌ర్స్ నిర్ణయిస్తారు. ఈ ట్రీట్‌మెంట్ అనేది లంగ్స్ Lungs లో చేరిన విషవాయువుని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని వదల‌డం చేస్తుంది. దీనిని ప్ర‌మాదం జ‌రిగిన 30 నిమిషాల లోపే చేయాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్ర‌మాదం ఉంది. అయితే మార్క్ శంక‌ర్ ఆసుప‌త్రి బిల్లు ల‌క్ష‌ల‌లో అయి ఉంటుంద‌ని కొంద‌రు ముచ్చ‌టించుకుంటూ ఉండ‌గా, అంత అయి ఉండ‌ద‌ని కొంద‌రు అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Mark Shankar | తిరుమలలో పవన్​ కుమారుడి పేరిట అన్నదానం

ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా సింగపూర్ (Singapore) లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి, అతన్ని హైదరాబాద్ Hyderabadకి తీసుకురావ‌డానికి మ‌రో రెండు మూడు రోజుల స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంది. చిరంజీవి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇండియా కి రానున్నార‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వారం త‌ర్వాత వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఊపిరి తిత్తుల్లోకి నల్ల పొగ బాగా వెళ్ల‌డం వ‌ల‌న కాస్త అసౌక‌ర్యంగా ఫీల‌వుతున్నాడు. మ‌రో రెండు మూడు రోజుల పాటు ఆక్సిజ‌న్ మాస్క్‌తోనే మార్క్ శంక‌ర్ ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ pm modi, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు cm Chandra babu, రేవంత్ రెడ్డి cm revanth reddy, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ys jagan, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, MLC Kavitha, Hero Jr. NTR హీరో జూనియర్ ఎన్టీఆర్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా వారు ఆకాంక్షించారు

Advertisement