అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. 2024 అక్టోబరులో 4,01,447 కార్లు అమ్ముడైనట్లు ఇండియన్ ఇన్‌ఫ్రా అండ్ టెక్ సంస్థ వెల్లడించింది. కార్ల అమ్మకాల్లో టాప్‌గా మారుతి సుజీకీ కంపెనీ నిలిచించి. మారుతి 1,59,591 కార్లను విక్రయించింది. హ్యుందాయ్ 55,568, మహింద్రా అండ్ మహింద్రా 54,504, టాటా మోటార్స్ 48,131, టయోట 30,845, కియా మోటార్స్ 28,545 కార్లను విక్రయించింది. దసరా, దీపావళి అక్టోబరు ఒకే నెలలో రావడంతో కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.