అక్షరటుడే, వెబ్‌డెస్క్: ట్రంప్ టారిఫ్(Trump Tariff) భయాలు తొలగిపోకున్నా.. మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని మార్కెట్లు రికవరీ దిశగా సాగుతున్నాయి. అమెరికా(America) మార్కెట్లతోపాటు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా సోమవారం భారీగా పతనమైన మార్కెట్లు ఈరోజు పాజిటివ్‌గా మారాయి. యూఎస్‌కు చెందిన నాస్‌డాక్ 0.10 శాతం లాభపడగా ఎస్‌అండ్‌పీ 0.23 శాతం నష్టపోయింది. డౌజోన్స్ ఫ్యూచర్స్ 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. యూరోప్ మార్కెట్లలో మాత్రం పతనం కొనసాగింది. 4.5 శాతం నష్టాలతో ముగిసింది.
జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 5.73 శాతం లాభంతో కొనసాగుతోంది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్ 2.31 శాతం లాభంతో ఉండగా సౌత్ కొరియాకు చెందిన కొప్సీ 1.32 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.37 శాతం లాభంతో కదలాడుతున్నాయి. జకార్త స్టాక్ మార్కెట్ 8.55 శాతం నష్టంతో ఉండగా తైవాన్ 4.18 శాతం, స్ట్రేయిట్స్ టైమ్స్ 2.18 నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ భారీ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 350 పాయింట్ల లాభంతో ఉంది. ఇది Tuesday morning మన మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమవుతాయని సూచిస్తోంది.
Stock market | గమనించాల్సిన అంశాలు
- మన మార్కెట్లలో సోమవారం ఎఫ్‌ఐఐలు భారీగా అమ్మకాలకు పాల్పడి నెట్ సెల్లర్లుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు రూ. 9,040 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 12,122 కోట్ల స్టాక్స్ కొనుగోలు చేసి భారీ పతనం నుంచి కోలుకోవడానికి కారణమయ్యారు.
- యూఎస్ 10 ఇయర్స్ ఈల్డ్ 0.01 శాతం పెరిగి 4.16 కు చేరుకుంది.
- డాలర్ ఇండెక్స్ 0.36 శాతం పతనమై 10.2.89 వద్ద కొనసాగుతోంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 1.35 శాతం పెరిగి 65.07 డాలర్ల వద్ద ఉంది.