అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుదేలు అవుతున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రపంచ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. అమెరికా సూచీలు కూడా నేల చూపులు చూస్తున్నాయి.
Donald Trump | రూ.349 లక్షల కోట్లు ఆవిరి
ఇటీవల ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో అమెరికా ఏకంగా రూ.349 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఆ మొత్తం విలువ యూకే, ఫ్రాన్స్ జీడీపీల కంటే అధికమని విశ్లేషకులు అంటున్నారు.
Donald Trump | టారిఫ్‌ల పేరుతో..
పరస్పర సుంకాలు విధించాలని నిర్ణయించడం, ఉద్యోగాల్లో కోత, ఇతర దేశాలకు సాయం నిలిపివేయడం తదితర నిర్ణయాలతో అమెరికా ఇన్వెస్టర్లు భయ పడుతున్నారు. దీంతో అమ్మకాలు చేపడుతుండటంతో మార్కెట్లు పడిపోతున్నాయి. దీంతో ఆ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎలన్‌మస్క్ కంపెనీ టెస్లా షేర్ ధర 15శాతం పడిపోయింది.
Donald Trump | బాండ్లలో పెట్టుబడికి మొగ్గు
మార్కెట్లు పడిపోతుండటంతో అమెరికా మదుపర్లు బాండ్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయాలతో బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే సురక్షితం అని భావిస్తున్నారు. మరోవైపు బంగారంపై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.